'సర్కారువారి పాట' దసరా తరువాత విడుదల?
- పరశురామ్ దర్శకత్వంలో 'సర్కారువారి పాట'
- వినోదమే ప్రధానంగా సాగే కథ
- మహేశ్ నెక్స్ట్ ప్రాజెక్టు త్రివిక్రమ్ తో
'సర్కారు వారి పాట' తరువాత మహేశ్ బాబు మరే సినిమాను ఒప్పుకోలేదు. అందువలన ఈ సినిమానే నిదానంగా .. నింపాదిగా చేస్తూ వస్తున్నాడు. ఈ నేపథ్యంలోనే అనుకోకుండా త్రివిక్రమ్ తో ప్రాజెక్టు సెట్ అయింది. అందువలన సాధ్యమైనంత త్వరగా ఆయన 'సర్కారువారి పాట'ను పూర్తి చేయాలనే ఆలోచనలో ఉన్నాడట. ఈ ఏడాది దసరా తరువాత ఈ సినిమాను విడుదల చేసి, వచ్చే ఏడాది వేసవిలో త్రివిక్రమ్ సినిమా రిలీజ్ ఉండేలా ప్లాన్ చేసుకుంటున్నట్టు తెలుస్తోంది. ఏం జరుగుతుందో చూడాలి మరి.