కాంగ్రెస్ పార్టీకీ ఓ టీవీ చానల్.. 24న 'ఐఎన్‌సీ టీవీ' ప్రారంభం
- నిన్న చానల్ విజన్ డాక్యుమెంట్ విడుదల
- తొలుత ఇంగ్లిష్, హిందీలో అందుబాటులోకి
- త్వరలో స్థానిక భాషలకూ విస్తరిస్తామన్న కాంగ్రెస్
బడుగు బలహీన వర్గాలకు గొంతుకగా మారనున్న తమ చానల్‌ను పంచాయతీ రాజ్ రోజున ప్రారంభించనున్నట్టు ఆ పార్టీ నేతలు మల్లికార్జున ఖర్గే, రణ్‌దీప్ సూర్జేవాలా మీడియాకు తెలిపారు. ఐఎన్‌సీ టీవీలో 8 గంటలపాటు లైవ్ ప్రోగ్రామ్స్ ఉంటాయన్నారు. తొలుత ఇంగ్లింగ్, హిందీ భాషల్లోనే చానల్ ప్రసారం అవుతుందని, మున్ముందు స్థానిక భాషాల్లోనూ అందుబాటులోకి తీసుకొస్తామన్నారు.