ఎన్టీయే నుంచి వైదొలగిన మరో ప్రాంతీయ పార్టీ
- ఇప్పటికే ఎన్డీయేకి గుడ్ బై చెప్పిన పలు పార్టీలు
- తాజాగా గోవా ఫార్వర్డ్ పార్టీ నిష్క్రమణ
- గోవాలో బీజేపీ విభజన రాజకీయాలు చేస్తోందన్న జీఎఫ్ పీ
- గోవా ప్రయోజనాలను కాపాడడంలో ఎన్డీయే విఫలమైందని వెల్లడి
గోవా ప్రయోజనాలను కాపాడడంలో ఎన్డీయే దారుణంగా విఫలమైందని విమర్శించారు. గోవా ప్రజలు సొంత రాష్ట్రంలో పరాయివాళ్లలా మారిపోయారంటూ అందుకు బీజేపీ విధానాలే కారణమని ఆరోపించారు. గోవా వ్యతిరేక విధానాలను పునరావృతం చేస్తూ, కొందరికి మేలు చేసేలా, మరెందరికో నిరాశ కలిగించేలా వ్యవహరిస్తోందని పేర్కొన్నారు.
హిందువుల పండుగ గుడీ పడ్వా సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో జీఎఫ్ పీ ఎగ్జిక్యూటివ్ కమిటీ ఈ నిర్ణయం తీసుకుంది. ఎన్డీయే నుంచి వైదొలగాలన్న తీర్మానానికి పార్టీ కార్యనిర్వాహక సభ్యులందరి మద్దతు లభించింది. కాగా, ఎన్డీయే నుంచి ఇప్పటికే అకాలీదళ్, రాష్ట్రీయ లోక్ తాంత్రిక్ పార్టీ దూరం జరిగిన సంగతి తెలిసిందే.