'ఉగాది' కానుకగా 'నారప్ప' స్పెషల్ పోస్టర్
- వెంకటేశ్ నుంచి మరో వైవిధ్యభరిత చిత్రం
- గ్రామీణ నేపథ్యంలో సాగే ఆసక్తికరమైన కథ
- భూమి కోసం ఓ సాధారణ రైతు చేసే పోరాటం
'ఉగాది' పండుగ సందర్భాన్ని పురస్కరించుకుని, ఈ సినిమా నుంచి ఒక స్పెషల్ పోస్టర్ ను వదిలారు. నారప్ప తన భార్యాబిడ్డలతో కలిసి ఎక్కడికో బయల్దేరినట్టుగా ఈ పోస్టర్లో కనిపిస్తున్నారు. తెల్లరంగు లుంగీ .. చొక్కా .. కండువాతో వెంకటేశ్ మెరిసిపోతున్నాడు. ఓ సాధారణమైన పల్లెటూరి ఇల్లాలిగా ప్రియమణి ఆకట్టుకుంటోంది. గ్రామీణ నేపథ్యంతో కూడిన ఈ పోస్టర్ .. 'ఉగాది' ఉత్సాహాన్ని తెస్తోంది. కష్టజీవి .. నిజాయితీపరుడైన ఒక రైతు తన భూమిని కాపాడుకోవడం కోసం ఏం చేశాడనేదే ఈ సినిమా కథ. మణిశర్మ సంగీతాన్ని అందించిన ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి.