హనుమంతుడి జన్మస్థలం అంజనాద్రే.. బలమైన ఆధారాలు వున్నాయి: టీటీడీ ఈవో ప్రకటన
- పండితులు, నిపుణులతో టీటీడీ కమిటీ
- ఆధారాలు సేకరించిన పండితుల కమిటీ
- శ్రీవారు కొలువై ఉన్న తిరుమలే ఆంజనేయుడి జన్మస్థలం
- త్వరలో ఆధారాలు బయటపెడతామన్న ఈవో
ఆధారాలతో నివేదిక తయారు చేశామని, దాన్ని త్వరలోనే ప్రజల ముందుంచి అభిప్రాయాలు సేకరిస్తామని తెలిపారు. ఆంజనేయుడి జన్మస్థలం తమ రాష్ట్రంలోనే ఉందని ఇప్పటివరకు ఏ రాష్ట్రమూ ప్రకటించలేదని ఆయన అన్నారు. ఒకవేళ ఇతర రాష్ట్రాల వద్ద అటువంటి ఆధారాలు ఉంటే బయటపెట్టవచ్చని పేర్కొన్నారు.
ఈ విషయంపై క్షేత్రస్థాయిలో చర్చ జరగాలని వ్యాఖ్యానించారు. తిరుమల సప్తగిరుల్లో ఒకటైన అంజనాద్రిలోనే ఆంజనేయుడు జన్మించాడన్న విషయంపై నిర్ధారణకు గత ఏడాది డిసెంబరులో పండితులు, నిపుణులతో టీటీడీ కమిటీని ఏర్పాటు చేసింది. దీనిపై పరిశోధన సాగించిన కమిటీ నివేదికను సమర్పించింది.