అమెరికాలోని పాఠశాలలో కాల్పుల కలకలం
- టేనస్సీలోని నాక్సివిల్లే నగరంలో ఘటన
- ఆస్టిన్ ఈస్ట్ మాగ్నెట్ హైస్కూల్లో కాల్పులు
- ఓ విద్యార్థి మృతి
- మరో విద్యార్థి, పోలీస్ అధికారికి గాయాలు
ఇందులో ఓ పోలీస్ అధికారి గాయపడ్డారు. ప్రస్తుతం వారికి ఆసుపత్రిలో చికిత్స అందుతోంది. ఈ కాల్పులు ఎందుకు జరిగాయన్న విషయంపై ఇంకా స్పష్టత రాలేదని, కాల్పుల్లో గాయపడి ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటోన్న విద్యార్థిని విచారిస్తే ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలుస్తాయని పోలీసులు అంటున్నారు. ఈ ఘటనపై పోలీసులు తదుపరి విచారణ కొనసాగిస్తున్నారు.