chaithra Kotoor: పెళ్లయిన మూడు రోజులకే ఆత్మహత్యాయత్నం.. ప్రాణాపాయం నుంచి బయటపడిన కన్నడ నటి చైత్ర

Actress Chaithra Kotoor condition suicide
షార్ట్స్‌లో చూడండి
నాలుగు రోజుల క్రితం ఆత్మహత్యకు యత్నించిన కన్నడ నటి, బిగ్‌బాస్ మాజీ పోటీదారు చైత్ర కొటూర్ ప్రాణాపాయం నుంచి బయటపడినట్టు వైద్యులు తెలిపారు. ఈ నెల 8న కోలార్‌లోని తన ఇంట్లో చైత్ర ఫినాయిల్ తాగి ఆత్మహత్యకు యత్నించింది. వెంటనే ఆమెను స్థానిక ఆసుపత్రికి తరలించారు. ఆమె ప్రాణాపాయం నుంచి బయపడిందని తాజాగా వైద్యులు తెలిపారు. చికిత్స కొనసాగుతున్నట్టు పేర్కొన్నారు. ఆత్మహత్యకు గల కారణాలు మాత్రం తెలియరాలేదు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

గత నెల 28న నాగార్జున అనే వ్యాపారవేత్తను ఓ ఆలయంలో వివాహం చేసుకున్నట్టు చైత్ర ప్రకటించింది. వీరి పెళ్లికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ పెళ్లికి చైత్ర కుటుంబ సభ్యులు కూడా హాజరయ్యారు. అయితే, వివాహమైన మూడు రోజులకే చైత్రకు కష్టాలు మొదలయ్యాయి. నాగార్జున ఇంటికి చైత్ర వెళ్లినప్పుడు అతడి కుటుంబ సభ్యులు ఆమెను అడ్డుకున్నారు. వివాహానికి చట్టబద్ధత లేదంటూ ఇంట్లోకి రానివ్వలేదు. ఈ నేపథ్యంలో మనస్తాపం చెందిన చైత్ర ఆత్మహత్యకు యత్నించినట్టు తెలుస్తోంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆత్మహత్యకు గల కారణాలపై ఆరా తీస్తున్నారు.
Go Back to Shorts
chaithra Kotoor
Suicide
Kannada
Bigg Boss

More Telugu News