లులూ గ్రూప్ ఎండీ కుటుంబానికి తప్పిన ప్రమాదం... హెలికాప్టర్ ఎమర్జెన్సీ ల్యాండింగ్
- భార్యతో కలిసి హెలికాప్టర్ లో ప్రయాణం
- హెలికాప్టర్ లో సాంకేతికలోపం
- వ్యవసాయ భూముల్లో ల్యాండింగ్
- బురదలో కూరుకుపోయిన హెలికాప్టర్
ఈ ఘటన జరిగిన సమయంలో హెలికాప్టర్ లో ఏడుగురు ఉన్నారు. లులూ గ్రూప్ ఎండీ యూసుఫ్ అలీ, ఆయన అర్ధాంగి క్షేమంగా ఉన్నట్టు అధికార వర్గాలు తెలిపాయి. వారిరువురిని పరిశీలన కోసం ఆసుపత్రికి తరలించారు. యూసుఫ్ అలీ యూఏఈలో ఉంటున్నారు. ఆయన భారత సంతతి కోటీశ్వరుడు. ఆయన నేతృత్వంలోని లులూ గ్రూప్ కు ప్రపంచవ్యాప్తంగా వ్యాపారాలు ఉన్నాయి.