Corona Virus: దేశంలో భారీగా పెరిగిపోతోన్న క‌రోనా కేసులు.. నిన్న 1.31 ల‌క్ష‌ల‌ మందికి నిర్ధారణ

India reports 131968 new COVID19 cases
షార్ట్స్‌లో చూడండి
దేశంలో క‌రోనా కేసులు రోజురోజుకీ భారీగా పెరిగిపోతున్నాయి. మొన్న ఒక్క రోజులో 1,26,789 మందికి కరోనా సోక‌గా, నిన్న  కొత్త‌గా 1,31,968 మందికి కరోనా నిర్ధారణ అయింది. వీటికి సంబంధించిన వివరాలను కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఈ రోజు ఉదయం విడుదల చేసింది. వాటి ప్రకారం... నిన్న‌  61,899  మంది కోలుకున్నారు. దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,30,60,542కు చేరింది.

గడచిన 24 గంట‌ల సమయంలో  780 మంది కరోనా కారణంగా మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 1,67,642 కు పెరిగింది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 1,19,13,292 మంది కోలుకున్నారు.  9,79,608  మందికి ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్‌లలో చికిత్స అందుతోంది. దేశ వ్యాప్తంగా  9,43,34,262 మందికి వ్యాక్సిన్లు వేశారు.
    
 
కాగా, దేశంలో నిన్నటి వరకు మొత్తం 25,40,41,584 కరోనా పరీక్షలు నిర్వహించినట్లు భారతీయ వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) తెలిపింది. నిన్న 13,64,205 శాంపిళ్లను పరీక్షించినట్లు పేర్కొంది.
Go Back to Shorts
Corona Virus
COVID19
India

More Telugu News