ఓ మహిళ ఆవేదనను వీడియో రూపంలో పంచుకున్న సోము వీర్రాజు

Somu Veerraju shares a video of woman who shout out for government schemes
  • జగన్ పాలనకు ఇదే నిదర్శనమన్న సోము వీర్రాజు
  • ఇల్లు, రేషన్ కార్డు అడిగితే బెదిరిస్తున్నారన్న మహిళ
  • రికార్డుల్లో చనిపోయినట్టు చూపిస్తున్నారని వెల్లడి
  • గట్టిగా నిలదీస్తే కొట్టడానికి వస్తున్నారని ఆరోపణ
నెల్లూరు జిల్లా సర్వేపల్లి నియోజకవర్గానికి చెందిన ఓ మహిళ ఆవేదనను ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు వీడియో రూపంలో పంచుకున్నారు. జగన్ పాలనలో పేదల దుస్థితికి ఇదే నిదర్శనమని విమర్శించారు. ఉండడానికి ఇల్లు, రేషన్ కార్డు అడిగితే బెదిరిస్తున్నారని... పంచాయతీ కార్యదర్శిని గట్టిగా నిలదీస్తే రికార్డుల్లో చనిపోయినట్టు చూపిస్తున్నాడని ఆ వీడియోలో ఒక మహిళ విలపిస్తూ చెప్పడాన్ని చూడొచ్చు.

కాగా, తానే కాకుండా పిల్లాపాపలున్న అనేక మంది మహిళల పరిస్థితి ఇలాగే ఉందని ఆ  మహిళ వాపోయింది. ప్రభుత్వ పథకాలపై ప్రశ్నిస్తే ఏం చేస్తావని బెదిరిస్తూ పైపైకి వస్తున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. వీఆర్వోలు, పంచాయతీ కార్యదర్శులందరిదీ ఇదే తీరని వెల్లడించింది.
Go Back to Shorts
Somu Veerraju
Woman
Video
Sarvepalli
Nellore District

More Telugu News