కరోనా వ్యాప్తి నేపథ్యంలో సర్వదర్శనం టోకెన్లు నిలిపివేయాలని టీటీడీ నిర్ణయం
- దేశవ్యాప్తంగా కరోనా విలయం
- దేశం నలుమూలల నుంచి తిరుమలకు భక్తులు
- ఈ నెల 11 వరకే సర్వదర్శనం టోకెన్ల జారీ
- 12వ తేదీ నుంచి టోకెన్ల నిలిపివేత
తిరుపతిలో భూదేవి, విష్ణునివాసం కాంప్లెక్స్ లలో సర్వదర్శనం టైమ్ స్లాట్ టోకెన్ల కోసం భక్తులు వేల సంఖ్యలో వేచిచూస్తుంటారు. తద్వారా కరోనా మరింతగా వ్యాపించే అవకాశం ఉందని టీటీడీ ఆందోళన చెందుతోంది. దానికితోడు తిరుపతి నగరంలోనూ కరోనా కేసులు అధికం అవుతున్నాయి.