శుభకార్యాల వేదికలను తలపిస్తున్న పుదుచ్చేరిలోని పోలింగ్ కేంద్రాలు
- రంగురంగుల బెలూన్లతో స్వాగత ద్వారం
- కాగితపు తోరణాల ఏర్పాటు
- వృద్ధులు, దివ్యాంగుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు
శుభకార్యం జరుగుతున్న వేదికల్లా పోలింగ్ కేంద్రాలను అలంకరించారు. రంగురంగుల బెలూన్లతో ఆకట్టుకునేలా తీర్చిదిద్దారు. పోలింగ్ కేంద్రం ప్రవేశ ద్వారం వద్ద బెలూన్లతోపాటు రంగురంగుల కాగితపు తోరణాలను ఏర్పాటు చేశారు. ఓటర్లకు ఎండలో ఇబ్బంది లేకుండా షామియానాలు ఏర్పాటు చేశారు. వృద్ధులు, దివ్యాంగులు ఇబ్బంది పడకుండా వారి కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.