తెలంగాణలో ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు వాయిదా
- వాస్తవానికి ఈ నెల 7 నుంచి ప్రాక్టికల్స్
- తెలంగాణలో కరోనా వ్యాప్తి తీవ్రం
- థియరీ పరీక్షల తర్వాత ప్రాక్టికల్స్ నిర్వహణ
- మే 29 నుంచి జూన్ 7 వరకు ప్రాక్టికల్స్
- థియరీ పరీక్షల నిర్వహణపైనా అనుమానాలు
థియరీ పరీక్షల తర్వాత మే 29 నుంచి జూన్ 7 వరకు ప్రాక్టికల్ పరీక్షలు నిర్వహించాలని ఇంటర్ బోర్డు తాజాగా నిర్ణయించింది. కాగా, రాష్ట్రంలోని ఇంటర్ విద్యార్థులు ప్రాక్టికల్ పరీక్షలకు ఇప్పటికే ఫీజులు కట్టేశారు. చివరి నిమిషంలో కరోనా కారణంగా ప్రాక్టికల్స్ వాయిదా వేసిన నేపథ్యంలో, థియరీ పరీక్షల నిర్వహణపైనా అనుమానాలు నెలకొన్నాయి.