అచ్చెన్నాయుడు నోరుపారేసుకోవడం సరైన పద్ధతి కాదు: మంత్రి ఆదిమూలపు సురేశ్
- తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నికలో గెలుస్తాం
- ప్రభుత్వ పనితీరు, సంక్షేమ పథకాలే అందుకు కారణమవుతాయి
- ప్రత్యేక హోదాను గత సర్కారు తాకట్టు పెట్టింది
ఆంధ్రప్రదేశ్‌కు రావాల్సిన ప్రత్యేక హోదాను స్వార్థ ప్రయోజనాల కోసం తాకట్టు పెట్టి గత టీడీపీ సర్కారు ప్రత్యేక ప్యాకేజీకి ఆశపడిందని ఆయన చెప్పారు. ఆ పార్టీని ఏపీ ప్రజలు నమ్మే స్థితిలో లేరని ఆయన వ్యాఖ్యానించారు.
ఈ విషయం తెలియకే ఆ పార్టీ నేతలు ఇంకా గెలుస్తామనే భ్రమల్లో బతుకుతున్నారని ఆయన ఎద్దేవా చేశారు. టీడీపీ నేత అచ్చెన్నాయుడు తమ పార్టీ ఎంపీలను గొర్రెలంటూ నోరు పారేసుకోవడం సరైన పద్ధతి కాదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.