నాపై పోటీ చేస్తున్న మమతకు ఓటమి ఖాయం: సువేందు అధికారి
- ఈ ప్రాంత ప్రజలతో నాది దశాబ్దాల అనుబంధం
- ప్రతి వ్యక్తితో నాకు వ్యక్తిగత అనుబంధం ఉంది
- నందిగ్రామ్ లో నా గెలుపు ఖాయం
అనంతరం మీడియాతో ఆయన మాట్లాడుతూ, తనపై పోటీ చేస్తున్న దీదీకి ఓటమి తప్పదని అన్నారు. ఈ ప్రాంత ప్రజలతో తనది దశాబ్దాల అనుబంధమని... ప్రతి వ్యక్తితో తనకు వ్యక్తిగత పరిచయం ఉందని చెప్పారు. తాను విజయం సాధించడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. బీజేపీకి ఓటు వేసేందుకు గ్రామీణ ప్రజలు కదిలొస్తున్నారని చెప్పారు. అన్ని బూత్ లలో ఏజెంట్లను నియమించుకోవడంలో కూడా టీఎంసీ విఫలమయిందని... దీదీ ఓటమి తప్పదని చెప్పడానికి ఇదే ఉదాహరణ అని అన్నారు. ప్రజలందరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు.