బంజారాహిల్స్‌లో యువతి కిడ్నాప్.. రక్షించాలంటూ కేకలు

Young Woman Kidnapped In Banjara Hills
  • రాత్రి పది గంటల సమయంలో కిడ్నాప్
  • బైక్‌లపై వచ్చిన నిందితులు
  • యువతి కేకలు విని అప్రమత్తమైన స్థానికులు
  • అప్పటికే పరారైన దుండగులు
హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌లో గత రాత్రి ఓ యువతిని ముగ్గురు యువకులు కిడ్నాప్ చేయడం కలకలం రేపింది. తనను రక్షించాలంటూ యువతి వేసిన కేకలకు జనం ఇళ్ల నుంచి బయటకు వచ్చినప్పటికీ, అప్పటికే యువతిని తీసుకుని కిడ్నాపర్లు పరారయ్యారు. స్థానిక దేవరకొండ బస్తీలోని రోడ్డు నంబరులో 3లో ఈ ఘటన జరిగింది.

బైక్‌లపై వచ్చిన ముగ్గురు దుండగులు యువతిని బలవంతంగా బైక్‌పైకి ఎక్కించారు. దీంతో యువతి భయంతో రక్షించాలంటూ కేకలు వేసింది. ఆమె అరుపులు విని అప్రమత్తమైన స్థానికులు వెంటనే బయటకు వచ్చారు. అయితే, అప్పటికే దుండగులు యువతిని తీసుకుని పరారయ్యారు. కిడ్నాప్‌పై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. సీసీటీవీ ఫుటేజీల ఆధారంగా నిందితుల కోసం గాలిస్తున్నారు.
Go Back to Shorts
Hyderabad
Banjara Hills
Kidnap
Young Woman

More Telugu News