Bandla Ganesh: బండ్ల గణేశ్ డబుల్ మిస్టేక్... నెటిజన్ల సెటైర్లు!

Bandla Ganesh English skills questioned
షార్ట్స్‌లో చూడండి
టాలీవుడ్ నటుడు, నిర్మాత బండ్ల గణేశ్ వ్యక్తిత్వం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సోషల్ మీడియాలో కాస్తంత చురుగ్గానే ఉండే ఆయన తాజాగా ఇంగ్లీషులో స్పెల్లింగ్ మిస్టేక్ కు పాల్పడి దొరికిపోయాడు. నెటిజన్లు అది తప్పని సూచించడంతో మరోసారి తప్పుగా స్పెల్లింగ్ ను పేర్కొని సెటైర్లు వేయించుకున్నాడు.

అసలేం జరిగిందంటే... కరోనా వ్యాప్తి నేపథ్యంలో మాస్కు తప్పనిసరిగా ధరించాలంటూ హైదరాబాదు పోలీసులు ప్రచారం చేస్తున్నారు. మాస్కు లేకపోతే జరిమానా తప్పదు అని హెచ్చరిస్తూ చలాన్లను సోషల్ మీడియాలో ప్రదర్శిస్తున్నారు.

దీనిపై స్పందించిన బండ్ల గణేశ్ మాస్కు ధరించండి అనే ఉద్దేశంతో Where mask అని పేర్కొన్నాడు. కానీ అక్కడ ఉండాల్సిన పదం Wear. ఇదే విషయాన్ని నెటిజన్లు గుర్తించి బండ్ల గణేశ్ ను అప్రమత్తం చేశారు. దాంతో ఆయన మరో పోస్టు పెట్టారు. ఈసారి కూడా ఆయన ఆ పదాన్ని సరిగ్గా రాయలేకపోయారు. ఈసారి Ware mask అని పేర్కొన్నారు. దాంతో నెటిజన్లు ఇక సెటైర్లకు దిగారు. మనది ఏ స్కూలు అన్నా అంటూ వ్యంగ్యం ప్రదర్శించారు. నీకు నేర్పించే సరికి మాకు వచ్చిన ఇంగ్లీషు పోయేట్టుంది అని ఎద్దేవా చేశారు.
Go Back to Shorts
Bandla Ganesh
English
Satires
Corona Campaign
Mask
Hyderabad
Telangana

More Telugu News