టాలీవుడ్ సినీ నిర్మాత ఆనంద ప్రసాద్ పై చీటింగ్ కేసు
- కోటి రూపాయలు తీసుకుని ఎగవేశాడంటూ ఆరోపణలు
- పోలీసులకు ఫిర్యాదు చేసిన సత్యనారాయణ అనే వ్యక్తి
- కేసు నమోదు చేసుకుని దర్యాప్తు షురూ చేసిన పోలీసులు
- అందుబాటులో లేకుండా పోయిన ఆనంద ప్రసాద్
భవ్య సిమెంట్స్, కన్ స్ట్రక్షన్స్ పేరిట ఇతర వ్యాపారాలు చేపడుతున్న ఆనంద ప్రసాద్ సినిమాలపై ఆసక్తితో నిర్మాతగానూ కొనసాగుతున్నారు. భవ్య క్రియేషన్స్ బ్యానర్ పై బాలయ్యతో పైసా వసూల్, నితిన్ తో చెక్, గోపీచంద్ తో వాంటెడ్, లౌక్యం, శౌర్యం వంటి చిత్రాలను నిర్మించారు. ఆయన గత ఎన్నికల్లో టీడీపీ తరఫున శేరిలింగంపల్లి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసినా ఓటమి పాలయ్యారు. ఆయనను భవ్య ఆనంద ప్రసాద్ అని పిలుస్తుంటారు.