నియోజకవర్గ ప్రజలతో సరదాగా బాక్సింగ్ చేసిన డీఎంకే అభ్యర్థి... వీడియో ఇదిగో!
- తమిళనాడులో ఎన్నికల సందోహం
- ప్రచారంలో తలమునకలుగా ఉన్న అభ్యర్థులు
- తిరువొత్తియూర్ నుంచి పోటీచేస్తున్న కేపీ శంకర్
- శంకర్ డీఎంకే అభ్యర్థి.. బాక్సింగ్స్ గ్లోవ్స్ తో ప్రచారం
శంకర్ తిరువొత్తియూర్ అసెంబ్లీ స్థానం నుంచి డీఎంకే అభ్యర్థిగా బరిలో ఉన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన చేతులకు బాక్సింగ్ గ్లోవ్స్ వేసుకుని సరదాగా తన నైపుణ్యాన్ని ప్రదర్శించారు. ప్రజలతో బాక్సింగ్ చేస్తూ వారిని ఉత్సాహపరిచారు. ప్రొఫెషనల్ బాక్సర్ కు ఏమాత్రం తీసిపోని రీతిలో పంచ్ లు, అప్పర్ కట్ లతో హుషారెత్తించారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అయి అందరినీ ఆకర్షిస్తోంది. తమిళనాడులో ఏప్రిల్ 6న పోలింగ్ జరగనున్న సంగతి తెలిసిందే.