బాలీవుడ్ సినిమాలో మెగా బ్రదర్!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

బాలీవుడ్ సినిమాలో మెగా బ్రదర్!

Nagababu gives nod for Hindi movie
  • హిందీలో 'ఛత్రపతి' సినిమా పునర్నిర్మాణం 
  • హీరోగా బెల్లంకొండ శ్రీనివాస్ బాలీవుడ్ ఎంట్రీ
  • బాలీవుడ్ కి పరిచయం అవుతున్న వినాయక్ 
  • విలన్ పాత్రకు ఎంపికైన నాగబాబు  
మెగాస్టార్ చిరంజీవి తమ్ముడు నాగబాబు అటు సినిమాలలో కీలక పాత్రలను పోషిస్తూనే.. ఇటు టీవీలలో పలు షోల ద్వారా ఎంతో పాప్యులర్ అయ్యారు. ముఖ్యంగా ఈటీవీలో వచ్చే 'జబర్దస్త్' కార్యక్రమం ద్వారా ప్రేక్షకులను ఎంతగానో అలరించారు. మరోపక్క, అంజనా ప్రొడక్షన్స్ బ్యానర్ పై పలు సినిమాలను కూడా నిర్మించి నిర్మాతగానూ తనదైన ప్రత్యేకతను చాటుకున్నారు. ఇప్పుడీయన ఆర్టిస్టుగా బాలీవుడ్ ప్రవేశం చేస్తున్నారు.

తెలుగులో సూపర్ హిట్టయిన 'ఛత్రపతి' చిత్రాన్ని యంగ్ హీరో బెల్లంకొండ శ్రీనివాస్ కథానాయకుడుగా హిందీలో రీమేక్ చేస్తున్న విషయం తెలిసిందే. ప్రముఖ దర్శకుడు వీవీ వినాయక్ ఈ చిత్రం ద్వారా దర్శకుడిగా బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నారు. ఇప్పుడీ చిత్రంలో నాగబాబు నటిస్తున్నట్టు తెలుస్తోంది.

ఇందులో విలన్ పాత్రకు నాగబాబును చిత్ర బృందం ఎంపిక చేసుకున్నట్టు సమాచారం. ఈ విషయంలో ప్రస్తుతం ఆయనతో సంప్రదింపులు జరుగుతున్నాయనీ, ఈ పాత్ర చేయడానికి నాగబాబు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని అంటున్నారు. త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడవచ్చు!
Nagababu
VV Vinayak
Bellamkonda Srinivas

More Telugu News