విజయసాయిరెడ్డిపై ఆ రోజు దాడి జరగలేదు: పార్లమెంటు ప్రివిలేజ్ కమిటీ నివేదిక
- విశాఖ ఎయిర్ పోర్టులో తనపై దాడి జరిగిందని విజయసాయి ఫిర్యాదు
- ఎలాంటి ఆధారాలు, సాక్ష్యాలు లేవన్న ప్రివిలేజ్ కమిటీ
- ఇది సభాహక్కుల ఉల్లంఘన కిందకు రాదని నివేదిక
విజయసాయిరెడ్డిపై దాడి జరిగిందని చెప్పడానికి ఎలాంటి ఆధారాలు, సాక్ష్యాలు లేవని సభాహక్కుల సంఘం తెలిపింది. విజయసాయిది తప్పుడు ఫిర్యాదుగా భావిస్తున్నామని చెప్పింది. ఆధారాలు లేని కారణంగా ఇది సభా హక్కుల ఉల్లంఘన కిందకు రాదని స్పష్టం చేసింది.