రోడ్డుపక్కనే బట్టలు ఉతికిన అన్నాడీఎంకే ఎమ్మెల్యే అభ్యర్థి!
- తమిళనాడులో నాయకుల వినూత్న ప్రచారం
- ఓటర్లను ఆకట్టుకోవడమే లక్ష్యం
- బట్టలు ఉతికి ఆకర్షించేందుకు అన్నాడీఎంకే అభ్యర్థి పాట్లు
- గెలిస్తే వాషింగ్ మెషీన్ కొనిస్తామని హామీ
234 స్థానాలున్న తమిళనాడు అసెంబ్లీకి ఏప్రిల్ 6న ఎన్నికలు జరగనున్నాయి. ఫలితాలు మే 2న వెలువడతాయి. ఈ నేపథ్యంలో రెండు ప్రధాన పార్టీలైన అన్నాడీఎంకే, డీఎంకే భారీ ఎత్తున ప్రచారం నిర్వహిస్తున్నాయి. సినీ నటుడు కమలహాసన్ పార్టీ మక్కల్ నీది మయ్యంతో కూడిన కూటమి సైతం ప్రభావం చూపే సూచనలు కనిపిస్తున్నాయి.