వైష్ణోదేవి ఆలయానికి 20 ఏళ్లలో 1,800 కేజీల బంగారం, రూ. 2 వేల కోట్ల నగదు విరాళం!
- 20 ఏళ్లలో 4,700 కేజీల వెండి విరాళం
- సమాచార హక్కు చట్టం ద్వారా వివరాలు తీసుకున్న హేమంత్
- 2020లో కరోనా వల్ల భారీగా తగ్గిన భక్తులు
గత కొన్నేళ్లుగా ఆలయానికి విరాళాల రూపంలో ఏం వచ్చిందనే విషయాన్ని తెలుసుకోవాలనుకున్నానని హేమంత్ తెలిపారు. ప్రతి ఏటా ఆలయాన్ని సందర్శించేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు వస్తుంటారని... అయినప్పటికీ విరాళాలు ఇంత ఎక్కువగా వచ్చాయనే విషయాన్ని తాను ఊహించలేకపోయానని చెప్పారు.
2000లో ఈ దేవాలయాన్ని 50 లక్షల మంది భక్తులు సందర్శించారు. 2018-19లలో ఈ సంఖ్య 80 లక్షలకు చేరుకుంది. అయితే కరోనా వల్ల 2020లో ఈ సంఖ్య 17 లక్షలకు పడిపోయింది.