SEC: గవర్నర్, ఎస్ఈసీ మధ్య ఉత్తర ప్రత్యుత్తరాలు లీక్... బొత్స, పెద్దిరెడ్డిలకు హైకోర్టు నోటీసులు

గవర్నర్ కు తాను రాసిన లేఖలు, గవర్నర్ ప్రత్యుత్తరాలు లీక్ కావడం పట్ల ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ హైకోర్టును ఆశ్రయించడం తెలిసిందే. తన లేఖలు బహిర్గతం కావడంపై సీబీఐ విచారణ కోరుతూ ఆయన పిటిషన్ వేశారు. ఈ పిటిషన్ పై విచారణ జరిపిన న్యాయస్థానం ఏపీ మంత్రులు బొత్స సత్యనారాయణ, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిలకు నోటీసులు జారీ చేసింది. అనంతరం ఈ కేసు విచారణను మార్చి 30కి వాయిదా వేసింది.

తాను రాస్తున్న ప్రివిలేజ్ లెటర్స్ కార్యాలయం నుంచి ఎలా బయటికి వస్తున్నాయో తెలుసుకోవాలని ఎస్ఈసీ తన పిటిషన్ లో కోరారు. ప్రివిలేజ్ లెటర్స్ లీక్ కాలేదని గవర్నర్ కార్యాలయం కార్యదర్శి చెబుతున్నారని, మరి ఆ లేఖలు ఎక్కడి నుంచి లీక్ అయ్యాయన్నది తేల్చాలని విజ్ఞప్తి చేశారు. పైగా ఆ లేఖలను సోషల్ మీడియాలో చూశామని మంత్రులు చెబుతున్నారని, తన లేఖలు సోషల్ మీడియాలోకి రావడం ఎలా సాధ్యమో గుర్తించాలని పేర్కొన్నారు.
SEC
Governor
Letters
Botsa Satyanarayana
Peddireddi Ramachandra Reddy
Andhra Pradesh

More Telugu News