టపాసులు కాల్చి నన్ను చంపేందుకు కుట్ర పన్నారు... ఏఎంఎంకే పార్టీపై తమిళనాడు మంత్రి ఆరోపణ
- మంత్రి కదంబూర్ రాజు ఆరోపణ
- తన విజయం ఖాయమని తెలిసే కుట్ర పన్నారన్న మంత్రి
- కారుకు మంటలంటుకుని మరణించేవాడినని వ్యాఖ్యలు
- ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు
వివరాల్లోకి వెళితే... ఆదివారం కోవిల్పట్టి నియోజకవర్గంలో రాజు ప్రచారం నిర్వహించారు. ఈ క్రమంలో రోడ్డుపై వెళుతుండగా.. ఆయన కారుని కొందరు అడ్డుకున్నారు. అదే కారు పక్కనే భారీ ఎత్తున బాణాసంచా పేల్చారు. ఈ క్రమంలో తన కారుకు మంటలంటుకుని భారీ ప్రమాదం జరిగి ఉండేదని మంత్రి అన్నారు. ఇది ఏఎంఎంకే పార్టీ పనేనని.. తనని చంపేందుకే ఇలా కుట్ర పన్నారని ఆరోపించారు.
ఘటన జరిగిన వెంటనే ఎన్నికల కమిషన్కు రాజు ఫిర్యాదు చేశారు. ఈ విషయంలో ఇంకా ఎవరిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. అలాగే మంత్రి ఆరోపణలపై ఏఎంఎంకే సైతం ఇప్పటి వరకు స్పందించలేదు.