ప్రపంచవ్యాప్తంగా 27 లక్షల మందిని బలితీసుకున్న కరోనా మహమ్మారి
- గణాంకాలు విడుదల చేసిన జాన్ హాప్‌కిన్స్ యూనివర్సిటీ
- ఇప్పటి వరకు ప్రపంచవ్యాప్తంగా 12,28,12,281 మందికి సంక్రమించిన వైరస్
- ఒక్క అమెరికాలోనే 5,41,907 మంది మృత్యువాత
మరోవైపు, కరోనా మహమ్మారి భారత్‌లో మరోమారు విజృంభిస్తోంది. దీంతో అప్రమత్తమైన పలు రాష్ట్ర ప్రభుత్వాలు ఆంక్షలు విధిస్తున్నాయి. విద్యాసంస్థలు, పబ్‌లు, రెస్టారెంట్లు తిరిగి మూసివేశాయి. నైట్ కర్ఫ్యూ అమలు చేస్తున్నాయి. మహారాష్ట్రలోని కొన్ని ప్రాంతాల్లో లాక్‌డౌన్ అమల్లో ఉంది. వైరస్ రెండోసారి విజృంభిస్తుండడంతో రాష్ట్రాలు అప్రమత్తంగా ఉండాలని ఇటీవల ముఖ్యమంత్రులతో జరిగిన సమావేశంలో ప్రధాని మోదీ సూచించారు.