Bandi Sanjay: ఈ ఎన్నిక‌ల్లో టీఆర్ఎస్ ఎలా గెలిచిందో ప్రజలకు తెలుసు: బండి సంజ‌య్

bandi sanjay slams trs
షార్ట్స్‌లో చూడండి
తెలంగాణ‌లో టీఆర్ఎస్‌కు ప్ర‌త్యామ్నాయం త‌మ పార్టీనే అని బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడు బండి సంజ‌య్ అన్నారు. ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో త‌మ పార్టీ అభ్య‌ర్థులు ఓడిపోయిన నేప‌థ్యంలో ఆయ‌న ఈ రోజు హైద‌రాబాద్‌లో మీడియాతో  మాట్లాడుతూ.. పీఆర్సీపై ప్ర‌భుత్వం నాట‌కాలు ఆడుతోందని చెప్పారు. ఉద్యోగులకు మంచి చేస్తే తాము సంతోషిస్తామ‌ని చెప్పారు.

టీఆర్ఎస్ నేత‌లు పట్టభద్రులను బెదిరింపులకు గురిచేశారని ఆయ‌న ఆరోపించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో నైతిక విజయం బీజేపీదేనని చెప్పుకొచ్చారు. ఈ ఎన్నిక‌ల్లో టీఆర్ఎస్ ఎలా గెలిచిందో ప్రజలకు తెలుసని ఆయ‌న వ్యాఖ్యానించారు. త‌మ పార్టీ ఓటు శాతం పెరిగింద‌ని, దీంతో అధికార టీఆర్ఎస్ పార్టీలో ఆందోళన మొదలైందని తెలిపారు. త‌మ పార్టీ ఓటమే లక్ష్యంగా ఇత‌ర పార్టీలు పనిచేశాయని బండి సంజ‌య్ అన్నారు.  


Go Back to Shorts
Bandi Sanjay
BJP
TRS

More Telugu News