కేటీఆర్ ను కలిసిన టీడీపీ నేత గంటా శ్రీనివాసరావు
- అసెంబ్లీ ప్రాంగణంలో కేటీఆర్ ను కలిసిన గంటా
- స్టీల్ ప్లాంటు ఉద్యమానికి ఇప్పటికే కేటీఆర్ మద్దతు
- విశాఖకు రావాలని ఆహ్వానించిన గంటా
గంటా కోరికపై కేటీఆర్ సానుకూలంగా స్పందించారు. త్వరలోనే విశాఖ పర్యటనపై నిర్ణయం తీసుకుంటానని చెప్పారు. ఇప్పటికే స్టీల్ ప్లాంట్ ఉద్యమానికి కేటీఆర్ మద్దతు ప్రకటించిన సంగతి తెలిసిందే. విశాఖ స్టీల్ ప్లాంట్ ఉద్యమానికి తాను మద్దతు ప్రకటిస్తున్నానని... రేపు తెలంగాణలోని బీహెచ్ఈఎల్, సింగరేణి జోలికి కేంద్రం వస్తే ఏపీ తమకు మద్దతు తెలపాలని ఆయన అన్నారు.