సామాన్యుడిలా ఆటోలో ప్ర‌యాణించిన హీరో అజిత్‌.. వీడియో ఇదిగో
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

సామాన్యుడిలా ఆటోలో ప్ర‌యాణించిన హీరో అజిత్‌.. వీడియో ఇదిగో

ajit pics video go viral
  • ఇటీవ‌ల సైక్లింగ్ చేసిన అజిత్
  • ఇప్పుడు మాస్కు పెట్టుకుని ఆటోలో ప్ర‌యాణం
  • వీడియో తీసిన ఓ వాహన‌దారుడు
ఇటీవ‌ల సైక్లింగ్ చేసి అంద‌రి దృష్టినీ ఆక‌ర్షించిన త‌మిళ స్టార్ హీరో అజిత్ ఇప్పుడు ఆటోలో ప్ర‌యాణించాడు. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్య‌మాల్లో వైర‌ల్ అవుతోంది. సామాన్యుడిలా ఆయ‌న ఆటోలో ప్ర‌యాణించిన తీరు ప‌ట్ల నెటిజ‌న్లు ప్ర‌శంస‌ల జ‌ల్లు కురిపిస్తున్నారు.

సినీ ప‌రిశ్ర‌మ‌లోకి రాకముండు ఆయ‌న బైక్ మెకానిక్‌గా పని చేశాడు. ఇప్పుడు కోట్లాది రూపాయ‌లు సంపాదిస్తున్న‌ప్ప‌టికీ సింపుల్ గానే ఉంటున్నాడు. అజిత్ ఆటోలో ప్ర‌యాణిస్తోన్న స‌మ‌యంలో ఈ విష‌యాన్ని గుర్తించిన ఓ వాహ‌న‌దారుడు తన స్మార్ట్ ఫోన్‌‌లో వీడియోను తీసి, సోషల్ మీడియాలో పోస్ట్ చేయ‌డంతో ఇది వైర‌ల్ అవుతోంది.
ajit
Kollywood

More Telugu News