అచ్చెన్నాయుడు, ఆత్రం పాత్రుడు తెగ గింజుకుంటున్నారు: విజయసాయిరెడ్డి ఎద్దేవా
- జనం సామాన్యులకు పట్టం కట్టారు
- తమ పెత్తనం ఎక్కడ పోతుందోనని టీడీపీ నేతల ఆందోళన
- మీడియాలో వీరు చేసే విన్యాసాలను ఎవరూ నమ్మరు
- ఉత్తరాంధ్రలో ఒక్క చోటా కనీసం పోటీ ఇవ్వలేకపోయారు
'జనం సామాన్యులకు పట్టం కట్టడంతో తమ పెత్తనం ఎక్కడ పోతుందోనని అచ్చెన్నాయుడు, ఆత్రం పాత్రుడు తెగ గింజుకుంటున్నారు. నామ్ కే వాస్తే అధ్యక్ష పదవిని కూడా బాబు ఎక్కడ పీకుతాడోనని వణుకు. మీడియాలో వీరు చేసే విన్యాసాలను ఎవరూ నమ్మరు. అందుకే ఉత్తరాంధ్రలో ఒక్క చోటా కనీసం పోటీ ఇవ్వలేకపోయారు' అంటూ టీడీపీ నేతలపై విజయసాయిరెడ్డి విమర్శలు గుప్పించారు.