ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్‌కి భారత జట్టు ప్రకటన.. సూర్యకు చోటు
- జట్టులో క్రునాల్ పాండ్యాకు చోటు
- ఇంగ్లండ్‌తో మూడు వన్డేల సిరీస్
- మొదటి వన్డే ఈ నెల 23న, రెండో వన్డే 26న, మూడో వన్డే 28న
మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా ఆ మూడు మ్యాచులు పూణెలోనే జరగనున్నాయి. మొదటి వన్డే ఈ నెల 23న, రెండో వన్డే 26న, మూడో వన్డే 28న జరుగుతుంది.
ఇటీవల జరిగిన టెస్టు సిరీస్‌లో విజయం సాధించిన టీమిండియా ప్రస్తుతం జరుగుతోన్న టీ20ల్లోనూ విజయం సాధించాలని కసిగా ఉంది. ఇప్పటివరకు జరిగిన నాలుగు టీ20 మ్యాచుల్లో 2-2 తో ఇరు జట్లు సమంగా నిలిచిన విషయం తెలిసిందే. నిర్ణయాత్మక ఐదో టీ20పై ఉత్కంఠ నెలకొంది. నాలుగో టీ20 మ్యాచులో సూర్యకుమార్ అద్భుతంగా రాణించడంతో వన్డే సిరీస్‌లో చోటు దక్కింది.