సంచలన నిర్ణయం తీసుకున్న కేంద్రం.. ఓటర్ ఐడీకి ఆధార్ అనుసంధానం!

  • లోక్ సభలో ప్రకటించిన కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్
  • ఆధార్ తో అనుసంధానం వల్ల ఓటు హక్కును పరిరక్షించవచ్చని వ్యాఖ్య
  • ఎవరు ఓటు వేశారో తెలుసుకునే వీలుంటుందన్న కేంద్ర మంత్రి
కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఆధార్ తో ఓటర్ ఐడీని అనుసంధానం చేస్తున్నట్టు పార్లమెంటులో ప్రకటించింది. డీఎంకే ఎంపీ దయానిధి మారన్ వేసిన ప్రశ్నకు లోక్ సభలో కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ సమాధానమిస్తూ.... ఓటర్ ఐడీకి ఆధార్ నంబరును అనుసంధానం చేస్తామని చెప్పారు. దీనివల్ల ఓటు హక్కు పరిరక్షణకు వీలవుతుందని అన్నారు. ఎవరు ఓటు వేశారో, ఎవరు వేయలేదో తెలుసుకునే అవకాశం కూడా ఉంటుందని చెప్పారు.

ఓటర్ ఐడీకి ఆధార్ ను అనుసంధానం చేయాలనే డిమాండ్లు ఎప్పటి నుంచో వినపడుతున్నాయి. ఆధార్ తో అనుసంధానిస్తే నకిలీ ఓట్లు తొలగిపోతాయని కేంద్ర ఎన్నికల సంఘం కూడా అభిప్రాయపడింది. ఓటర్ ఐడీని ఆధార్ తో అనుసంధానం చేస్తే... నకిలీ ఓట్లను సులభంగా తొలగించవచ్చు. ఒక్కొక్కరు కేవలం ఒక ఓటుకు మాత్రమే పరిమితమవుతారు. రెండు, మూడు చోట్ల ఓటరుగా నమోదు చేసుకోవడం కుదరదు.

Voter ID
Aadhar
Link

More Telugu News