ప్రేమకథా చిత్రంలో అనుష్క సరసన నవీన్ పోలిశెట్టి!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ప్రేమకథా చిత్రంలో అనుష్క సరసన నవీన్ పోలిశెట్టి!

Naveen Polishetty opposite Anushka Shetty
  • 'జాతిరత్నాలు'తో నవీన్ పోలిశెట్టికి ఆఫర్లు
  • మహేశ్ దర్శకత్వంలో అనుష్క సినిమా  
  • 40 ఏళ్ల మహిళ, 25 ఏళ్ల కుర్రాడి మధ్య ప్రేమకథ  
ఇటీవలి కాలంలో బాగా పేరుతెచ్చుకుంటున్న యువ కథానాయకుడుగా నవీన్ పోలిశెట్టిని చెప్పుకోవచ్చు. ఏ పాత్రనైనా మంచి ఈజ్ తో అభినయిస్తూ.. మంచి ఆర్టిస్టుగా గుర్తింపు తెచ్చుకున్నాడు. తాజాగా విడుదలైన 'జాతిరత్నాలు' చిత్రమైతే సూపర్ హిట్ కావడంతో నవీన్ కి మరింత పేరువచ్చింది. దీంతో అతనికి ఆఫర్లు కూడా వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలో ప్రముఖ నటి అనుష్క సరసన నటించే ఛాన్స్ ఈ కుర్రాడికి వచ్చినట్టు తెలుస్తోంది.

'నిశ్శబ్దం' తర్వాత కాస్త గ్యాప్ తీసుకున్న అనుష్క ఇప్పుడు ఓ వెరైటీ ప్రేమకథ చిత్రంలో నటించడానికి అంగీకరించింది. గతంలో 'రారా కృష్ణయ్య' చిత్రాన్ని రూపొందించిన మహేశ్ దీనికి దర్శకత్వం వహిస్తాడు. ఈ చిత్రంలో హీరోగా తాజాగా నవీన్ పోలిశెట్టిని ఎంపిక చేసినట్టు సమాచారం. నలభై ఏళ్ల మహిళ.. పాతికేళ్ల కుర్రాడి మధ్య ప్రేమకథగా ఇది తెరకెక్కుతుందట. దీనిని దృష్టిలో పెట్టుకునే నవీన్ ని ఎంపిక చేసినట్టు తెలుస్తోంది. యూవీ క్రియేషన్స్ సంస్థ దీనిని నిర్మిస్తుంది.
Naveen Polishetty
Anushka Shetty
Mahesh
Love Story

More Telugu News