Trains: ట్రాక్ మరమ్మతుల కారణంగా పలు రైళ్లు పాక్షికంగా రద్దు

Trains partially cancelled due to track maintenance work
షార్ట్స్‌లో చూడండి
రైల్వే ట్రాక్ మరమ్మతులు, ఇతర నిర్వహణ పనుల కారణంగా పలు రైళ్లను రెండ్రోజులు పాక్షికంగా రద్దు చేస్తున్నట్టు అధికారులు వెల్లడించారు. ఈ నెల 19, 20 తేదీల్లో ట్రాక్ మరమ్మతులు జరుగుతున్నందున ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు.  హైదరాబాద్-తాంబరం (రైలు నెంబరు 02760) రైలు చెన్నై ఎగ్మోర్-తాంబరం మధ్య... కాచిగూడ-చెంగల్ (నెంబరు 07652) రైలును, 07644 నెంబరు కలిగిన కాకినాడ పోర్టు-చెంగల్ రైలును చెంగల్పట్టు-చెన్నై ఎగ్మోర్ మధ్య పాక్షికంగా రద్దు చేస్తున్నట్టు అధికారులు వివరించారు. ఈ మేరకు చేసిన మార్పులను ప్రయాణికులు గమనించాలని కోరారు. 
Go Back to Shorts
Trains
Cancel
Track
Works

More Telugu News