ఇంగ్లండ్ తో రెండో టీ20లో టీమిండియా టార్గెట్ 165 రన్స్... డకౌట్ అయిన రాహుల్
- అహ్మదాబాద్ లో భారత్, ఇంగ్లండ్ మధ్య రెండో టీ20
- మొదట బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్
- 20 ఓవర్లలో 6 వికెట్లకు 164 పరుగుల స్కోరు
- రాణించిన జాసన్ రాయ్
- సుందర్, ఠాకూర్ లకు చెరో రెండు వికెట్లు
ఇక లక్ష్యఛేదనలో భారత్ ఆరంభంలోనే కేఎల్ రాహుల్ వికెట్ కోల్పోయింది. రాహుల్ పరుగులేమీ చేయకుండానే శామ్ కరన్ బౌలింగ్ వికెట్ కీపర్ జోస్ బట్లర్ కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ప్రస్తుతం భారత్ 4 ఓవర్లలో 1 వికెట్ నష్టానికి 22 పరుగులు చేసింది. క్రీజులో ఇషాన్ కిషన్ (11 బ్యాటింగ్), కెప్టెన్ విరాట్ కోహ్లీ (10 బ్యాటింగ్) ఉన్నారు. భారత్ విజయానికి ఇంకా 16 ఓవర్లలో 143 పరుగులు చేయాలి.