ఇంగ్లండ్ తో రెండో టీ20లో టాస్ గెలిచిన టీమిండియా
భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య అహ్మదాబాద్ వేదికగా నేడు రెండో టీ20 మ్యాచ్ జరగనుంది. ఈ పోరులో టీమిండియా టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. ఇప్పటికే తొలి టీ20లో ఓటమిపాలైన భారత జట్టు ఈ మ్యాచ్ లో గెలిచి సమం చేయాలని భావిస్తోంది. తొలి మ్యాచ్ కు రోహిత్ శర్మను విశ్రాంతి పేరుతో పక్కనబెట్టిన టీమిండియా మేనేజ్ మెంట్ పై విమర్శలు రావడం తెలిసిందే.
అయితే ఈ మ్యాచ్ లోనూ రోహిత్ ను తీసుకోలేదు. సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్ కు స్థానం కల్పించారు. అటు, ఇంగ్లండ్ జట్టులో ఆల్ రౌండర్ టామ్ కరన్ కు తుదిజట్టులో చోటిచ్చారు.
అయితే ఈ మ్యాచ్ లోనూ రోహిత్ ను తీసుకోలేదు. సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్ కు స్థానం కల్పించారు. అటు, ఇంగ్లండ్ జట్టులో ఆల్ రౌండర్ టామ్ కరన్ కు తుదిజట్టులో చోటిచ్చారు.