ఇంత బ్రహ్మాండమైన విజయం ఇప్పటివరకు ఏ అధికార పక్షానికి రాలేదు: అంబటి
- ఏపీ మున్సిపల్ ఎన్నికల్లో వైసీపీ ఆధిపత్యం
- విపక్షాల బేజారు
- ఫలితాలపై సంతోషం వ్యక్తం చేసిన అంబటి
- రాష్ట్రంలో నిజమైన హీరో జగన్ అంటూ వ్యాఖ్యలు
మున్సిపల్ ఎన్నికల ఫలితాలు వెలువడుతున్న సమయంలో చంద్రబాబు, లోకేశ్ ఎక్కడికి వెళ్లారు?... హైదరాబాదులో పాచి పనులు చేసుకోవడానికి వెళ్లారా? అంటూ వ్యంగ్యం ప్రదర్శించారు. ఏకగ్రీవాలు అయితే విమర్శించారని, ఏకగ్రీవాలు కాని చోట కూడా అదే రీతిలో ఫలితాలు వస్తున్నాయని అన్నారు. చంద్రబాబు సొంత పుత్రుడు లోకేశ్, దత్తపుత్రుడు పవన్ కల్యాణ్ ఏమైపోయారంటూ ఎద్దేవా చేశారు.
అమరావతికి ఈ ఎన్నికలు రిఫరెండం అని చంద్రబాబు అన్నాడని, కానీ ప్రజలు తమ అభిప్రాయం ఏంటో ఓటుతో స్పష్టంగా చెప్పారని అంబటి పేర్కొన్నారు. పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లో టీడీపీ దారుణ పరాజయాలు చవిచూసిన దరిమిలా, ఏపీలో ఇక ప్రతిపక్షమే లేదన్నది స్పష్టమైందని వ్యాఖ్యానించారు.