దేశంలో కొత్త‌గా 24,882 మందికి కరోనా నిర్ధారణ.. 140 మంది మృతి

  24000 New Coronavirus Cases In India
  • మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,13,33,728
  • మృతుల సంఖ్య 1,58,446
  • కోలుకున్న వారు 1,09,73,260 మంది
  • 2,82,18,457 మందికి వ్యాక్సిన్లు    
దేశంలో గత 24 గంటల్లో 24,882 మందికి కరోనా నిర్ధారణ అయింది. కొత్త‌గా న‌మోదైన క‌రోనా కేసుల వివరాలను కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఈ రోజు ఉదయం విడుదల చేసింది. వాటి ప్రకారం... 19,957 మంది కోలుకున్నారు. దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,13,33,728కు చేరింది.

గడచిన 24 గంట‌ల సమయంలో 140 మంది కరోనా కారణంగా మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 1,58,446కు పెరిగింది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 1,09,73,260  మంది కోలుకున్నారు. 2,02,022 మందికి ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్‌లలో చికిత్స అందుతోంది. దేశవ్యాప్తంగా 2,82,18,457 మందికి వ్యాక్సిన్లు వేశారు.
    
కాగా, దేశంలో నిన్నటి వరకు మొత్తం 22,58,39,273 కరోనా పరీక్షలు నిర్వహించినట్లు భారతీయ వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) తెలిపింది. నిన్న 8,40,635 శాంపిళ్లను పరీక్షించినట్లు పేర్కొంది.
Go Back to Shorts
Corona virus
India
COVID19

More Telugu News