సీఎం కావాలనుకుంటే ఆయన మళ్లీ కాంగ్రెస్ లోకి రావాల్సిందే: రాహుల్ గాంధీ
- కాంగ్రెస్ లో ఉంటే సింధియా సీఎం అయ్యేవారు
- బీజేపీలోకి వెళ్లి బ్యాక్ బెంచర్ అయిపోయారు
- సింధియా ఎప్పటీకీ సీఎం కాలేరు
'నేను చెపుతున్న విషయాన్ని రాసి పెట్టుకోండి. సింధియా ఏ రోజూ సీఎం కాలేరు. ముఖ్యమంత్రి కావాలనుకుంటే ఆయన మళ్లీ కాంగ్రెస్ పార్టీలోకి రావాలి' అని రాహుల్ అన్నారు. ఆరెస్సెస్ సిద్ధాంతాలపై యూత్ కాంగ్రెస్ సభ్యులు పోరాడాలని... ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదని విమర్శించారు. గత ఏడాది మార్చిలో కాంగ్రెస్ కు గుడ్ బై చెప్పిన సింధియా బీజేపీలో చేరారు.