ఏపీలో క్రమంగా పెరుగుతున్న కరోనా కొత్త కేసుల సంఖ్య
- గత 24 గంటల్లో 45,702 కరోనా పరీక్షలు
- 136 మందికి పాజిటివ్
- ఒక్క చిత్తూరు జిల్లాలోనే 49 కొత్త కేసులు
- ఒకరి మృతి
- ఇంకా 998 మందికి కొనసాగుతున్న చికిత్స
అదే సమయంలో 58 మంది కరోనా నుంచి కోలుకోగా, చిత్తూరు జిల్లాలో ఒక మరణం సంభవించింది. రాష్ట్రంలో ఇప్పటివరకు 8,90,692 పాజిటివ్ కేసులు నమోదు కాగా 8,82,520 మంది కోలుకుని ఆరోగ్యవంతులయ్యారు. యాక్టివ్ కేసుల సంఖ్య కూడా క్రమంగా పెరుగుతోంది. ప్రస్తుతం రాష్ట్రంలో యాక్టివ్ కేసుల సంఖ్య 998గా నమోదైంది. మొత్తం మరణాల సంఖ్య 7,174కి చేరింది.