బెంగాల్ ప్రజల సోనార్ బంగ్లా కలను బీజేపీ సాకారం చేస్తుంది: మోదీ
- పశ్చిమ బెంగాల్ లో అసెంబ్లీ ఎన్నికలు
- ఇటీవల షెడ్యూల్ విడుదల
- బెంగాల్ ఎన్నికల ప్రచారానికి వచ్చిన ప్రధాని
- కోల్ కతా బ్రిగేడ్ మైదానంలో భారీ సభ
- బెంగాల్ అభివృద్ధికి హామీ
ఓవైపు ప్రధాని మోదీ ఎన్నికల ప్రచారానికి వచ్చిన సమయంలో పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ పెట్రోల్, గ్యాస్ ధరల పెంపును వ్యతిరేకిస్తూ భారీ ర్యాలీ నిర్వహించారు. కేంద్రం తీరును నిరసించారు.
అటు, బీజేపీలోకి ప్రముఖుల చేరికలు కొనసాగుతున్నాయి. తాజాగా బాలీవుడ్ నట దిగ్గజం మిథున్ చక్రవర్తి బీజేపీ తీర్థం పుచ్చుకోవడం తెలిసిందే. మిథున్ చక్రవర్తి గతంలో తృణమూల్ కాంగ్రెస్ తరఫున రాజ్యసభకు ఎన్నికయ్యారు.
కాగా, పశ్చిమ బెంగాల్ లో అసెంబ్లీ ఎన్నికలు 8 విడతల్లో జరగనున్నాయి. మార్చి 27 నుంచి ఏప్రిల్ 29 వరకు పోలింగ్ పలు దఫాలు నిర్వహించనున్నారు. మే 2న ఫలితాలు వెల్లడిస్తారు.