విజయనగరం జిల్లాలో భారీ అగ్నిప్రమాదం.. 40 పూరిళ్లు దగ్ధం!
- బాధితులందరూ గిరిజనులే
- రూ. 40 లక్షల ఆస్తి నష్టం
- కట్టుబట్టలతో మిగిలిన బాధితులు
బాధితులందరూ గిరిజనులేనని, వారంతా వ్యవసాయ కూలీలుగా పనిచేస్తున్నారని అధికారులు తెలిపారు. మధ్యాహ్నం మూడు గంటల సమయంలో కరాసి కుమారి అనే మహిళ ఇంటి పక్కన ఉన్న తుప్పల నుంచి నిప్పు రవ్వలు ఎగసి పడ్డాయని, ప్రమాదానికి అదే కారణమని తెలుస్తోంది. తొలుత కుమారి ఇంటికి మంటలు అంటుకున్నాయి. అయితే, వాటిని ఎవరూ గుర్తించకపోవడంతో అగ్ని కీలలు ఇతర ఇళ్లకు వ్యాపించాయి. మొత్తం 50 ఇళ్లకు గాను 40 ఇళ్లు అగ్నికి ఆహుతయ్యాయి. దాదాపు 40 లక్షల రూపాయల ఆస్తినష్టం సంభవించినట్టు అధికారులు తెలిపారు.