అహ్మదాబాద్ టెస్టులో ముగిసిన తొలిరోజు ఆట

  • అహ్మదాబాద్ లో భారత్, ఇంగ్లండ్ మధ్య నాలుగో టెస్టు
  • తొలి ఇన్నింగ్స్ లో ఇంగ్లండ్ 205 ఆలౌట్
  • ఆట చివరికి భారత్ తొలి ఇన్నింగ్స్ లో వికెట్ నష్టానికి 24 రన్స్
  • డకౌట్ అయిన శుభ్ మాన్ గిల్
  • క్రీజులో రోహిత్, పుజారా
అహ్మదాబాద్ లో భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య జరుగుతున్న నాలుగో టెస్టులో తొలిరోజు ఆట ముగిసింది. ఆట చివరికి తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన టీమిండియా 1 వికెట్ నష్టానికి 24 పరుగులు చేసింది. ఓపెనర్ రోహిత్ శర్మ 8, ఛటేశ్వర్ పుజారా 15 పరుగులతో క్రీజులో ఉన్నారు. యువ ఓపెనర్ శుభ్ మాన్ గిల్ ఖాతా ఆరంభించకుండానే ఇంగ్లండ్ పేసర్ ఆండర్సన్ బౌలింగ్ లో ఎల్బీడబ్ల్యూ అయ్యాడు. అంతకుముందు ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్ లో 205 పరుగులు చేసింది. ప్రస్తుతం భారత జట్టు ఇంగ్లండ్ స్కోరుకు ఇంకా 181 పరుగులు వెనుకబడి ఉంది.

Ahmedabad Test
First Day
First Innings
India
England

More Telugu News