నాలుగో టెస్టులో టాస్ గెలిచిన ఇంగ్లండ్... తొలుత బ్యాటింగ్!

England Won the Toss and Choose to Bat First
  • స్పిన్ కు అనుకూలించేలా పిచ్
  • తొలుత బ్యాటింగ్ అడ్వాంటేజ్ తీసుకున్న ఇంగ్లండ్
  • తుది జట్టులో మహమ్మద్ సిరాజ్ కు స్థానం
మొతేరాలోని నరేంద్ర మోదీ క్రికెట్ స్టేడియంలో జరుగుతున్న కీలకమైన నాలుగో టెస్టులో టాస్ గెలిచిన ఇంగ్లండ్ జట్టు బ్యాటింగ్ ను ఎంచుకుంది. ఈ పిచ్ కూడా స్పిన్ కు అనుకూలిస్తుందన్న వార్తలు ముందుగానే వచ్చిన నేపథ్యంలో, తొలుత బ్యాటింగ్ అడ్వాంటేజ్ ని వినియోగించుకోవాలని ఇరు జట్లూ భావించగా, ఆ అవకాశం ఇంగ్లండ్ కు దక్కింది.

ఈ పిచ్ తొలుత బ్యాటింగ్ కు అనుకూలిస్తుందని భావిస్తున్నామని, ఆపై స్పిన్ కు సహకరిస్తుందన్న అంచనాతోనే తొలుత బ్యాటింగ్ ను ఎంచుకున్నట్టు ఇంగ్లండ్ కెప్టెన్ రూట్ తెలుపగా, ఇంచుమించు తనది కూడా అదే అభిప్రాయమని కోహ్లీ చెప్పాడు. ఈ మ్యాచ్ లో బుమ్రా స్థానంలో మహమ్మద్ సిరాజ్ ను తుది జట్టుకు ఎంపిక చేసినట్టు తెలిపాడు. తమ స్పిన్నర్లు ఇంగ్లండ్ ను కట్టడి చేయగలరనే భావిస్తున్నట్టు వ్యాఖ్యానించాడు.
Go Back to Shorts
India
England
Test
Toss

More Telugu News