కుర్రాడి ప్రతిభకు ఫిదా అయిన సచిన్.. వీడియో ఇదిగో!
- రూబిక్స్ క్యూబ్ ను 17 సెకన్లలోనే సెట్ చేసిన కుర్రాడు
- అదీ దాన్ని చూడకుండా సెట్ చేసిన వైనం
- ఇప్పటికే గిన్నిస్ బుక్‌లోనూ చోటు
అతడి గురించి సచిన్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో స్పందిస్తూ... తనతో పాటు ఇక్కడ అమన్ కొలి ఉన్నాడని, అతడికి రూబిక్స్ క్యూబ్ ఇస్తానని చెప్పారు. అతడు దాని వైపు చూడకుండానే దాన్ని సాల్వ్ చేస్తాడని తెలిపారు. ఆ కుర్రాడు గిన్నిస్ బుక్ రికార్డు కూడా సాధించాడని వివరించారు.
ఈ ఇండియన్ మన అందరినీ గర్వపడేలా చేశాడంటూ ప్రశంసించారు. సాధారణంగా మనం కళ్లు తెరిచి చూస్తూ కూడా చేయలేని పనిని అతడు చూడకుండానే చేశాడని చెప్పారు. ఇప్పుడు అతడి ముందు ఓ పెద్ద సవాలు ఉందని, ఆయన లాగా తనకు కూడా రూబిక్స్ క్యూబ్ సాల్వ్ చేయడం నేర్పించాల్సి ఉందని చమత్కరించారు.