ఇంగ్లండ్‌తో త్వరలో వన్డే సిరీస్.. రోహిత్‌శర్మ, పంత్, సుందర్ దూరం!

Rohit Sharma out from One Day Series
  • గత ఐపీఎల్ నుంచి బయోబబుల్‌లో పది మంది ఆటగాళ్లు
  • వీలైనంత ఎక్కువ మందికి విశ్రాంతి నివ్వాలని బోర్డు నిర్ణయం
  • టీ20 సిరీస్ నుంచి బుమ్రా, సిరాజ్‌లకు విశ్రాంతి
ఇంగ్లండ్‌తో త్వరలో జరగనున్న వన్డే సిరీస్‌కు రోహిత్ శర్మ దూరం కానున్నట్టు తెలుస్తోంది. గత ఐపీఎల్ నుంచి బయోబబుల్‌లోనే ఉంటున్న పది మంది ఆటగాళ్లలో వీలైనంత ఎక్కువ మందికి విశ్రాంతి కల్పించాలని భావించిన బోర్డు ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. బయోబబుల్‌లో ఎక్కువ కాలం గడిపితే మానసిక ఇబ్బందులు తప్పవని భావిస్తున్న బోర్డు ఈ నిర్ణయం తీసుకుంది. అంతేకాదు, బయోబబుల్‌లో ఎక్కువ కాలం ఉండడం వల్ల వచ్చే మానసిక ఇబ్బందుల గురించి కూడా ఆటగాళ్లకు అవగాహన కల్పించింది.

ఇంగ్లండ్‌తో త్వరలో జరగనున్న టీ20 సిరీస్‌కు జట్టును ప్రకటించిన బీసీసీఐ జస్ప్రీత్ బుమ్రా, సిరాజ్‌లకు విశ్రాంతి కల్పించింది. ఇప్పుడు వన్డే సిరీస్‌ నుంచి రోహిత్ శర్మ, వాషింగ్టన్ సుందర్, రిషభ్ పంత్‌లను పక్కనపెట్టినట్టు తెలుస్తోంది. ఈ నెల 12 నుంచి టీ20 సిరీస్ ప్రారంభం కానుండగా, 23 నుంచి వన్డే సిరీస్ ప్రారంభం కానుంది.
Go Back to Shorts
Rohit Sharma
England
Team India

More Telugu News