హైదరాబాదులోనూ '100 ఆక్టేన్ ప్రీమియం' పెట్రోల్.. లీటరు రూ.160
- ఇప్పటికే పలు నగరాల్లో విక్రయాలు
- హైదరాబాదులోనూ అమ్మకాలు షురూ చేసిన ఐఓసీ
- వాహనాల ఇంజిన్ సామర్థ్యం మరింత పెరుగుతుందన్న డీలర్లు
- బీఎస్-6 వాహనాలకు ఈ పెట్రోల్ తగినదని నిపుణుల అభిప్రాయం
ఈ ప్రీమియం స్థాయి పెట్రోల్ ను గతేడాది నుంచి ఢిల్లీ, గురుగ్రామ్, నోయిడా, ఆగ్రా, ముంబయి, అహ్మదాబాద్, చండీగఢ్, జైపూర్, లుధియానా నగరాల్లో విక్రయిస్తున్నారు. కాగా, ఈ నాణ్యమైన పెట్రోల్ మధురలోని ఐఓసీ రిఫైనరీ నుంచి సరఫరా చేస్తున్నారు. బీఎస్-6 వాహనాలకు ఈ పెట్రోల్ సరైనదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.