హైదరాబాద్‌లో డ్రంకెన్ డ్రైవ్ చేసి బీభత్సం సృష్టించిన యువకుడు.. ఒకరి మృతి
- వనస్థలిపురం పరిధిలో ఘటన
- ఈ రోజు తెల్లవారుజామున ప్రమాదం
- కారు నడిపిన యువకుడి అరెస్టు
- కారులోని మరొకరు పరారీ
ఆ సమయంలో రోడ్డుపై ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. కారులో మొత్తం ముగ్గురు ఉన్నట్లు తెలుస్తోంది. ప్రమాదం జరిగిన వెంటనే ఓ యువకుడు పారిపోగా.. కారు నడిపిన గౌతమ్‌ను పోలీసులు అరెస్టు చేశారు. కారులో ఆ ముగ్గురు సాగర్ రోడ్ నుంచి ఇబ్రహీంపట్నం వైపు వెళ్తున్నారని చెప్పారు. ఈ ప్రమాద ఘటనపై వనస్థలిపురం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.