సన్షా సిటీ... దక్షిణ చైనా సముద్రంలో చైనా అతి భారీ నగరం!
- దక్షిణ చైనా సముద్రంపై పట్టు పెంచుకునేందుకు చైనా ప్రయత్నం
- 2012లో సన్షా సిటీ ప్రకటన
- ఇప్పటికి 8 లక్షల చదరపు మైళ్ల విస్తీర్ణానికి పెరిగిన నగరం
- న్యూయార్క్ సిటీ కంటే 1,700 రెట్లు పెద్ద నగరం
దక్షిణ చైనా సముద్రంలోని అనేక దీవుల సమాహారంగా సన్షా సిటీ గురించి చెప్పుకోవచ్చు. అయితే పారాసెల్ దీవులు తమకే చెందుతాయని అటు వియత్నాం, తైవాన్ చెబుతుండగా, స్ప్రాట్లీ దీవుల భూభాగంపై తమకే హక్కులు ఉన్నాయని వియత్నాం, తైవాన్ లతో పాటు ఫిలిప్పీన్స్, మలేసియా, బ్రూనై వంటి దేశాలు వాదిస్తున్నాయి.
చైనా ఇవేవీ పట్టించుకోకుండా దక్షిణ చైనా సముద్రంపై తన పట్టును మరింత పెంచుకునేందుకు సన్షా సిటీని విస్తరించుకుంటూ పోతోంది. వివాదాస్పద దీవులన్నింటినీ ఈ నగరం పరిధిలో కలిపేస్తోంది. ఈ క్రమంలోనే సన్షా సిటీ తిరుగులేని భారీ నగరంగా అవతరించింది. ఈ మేరకు అమెరికా నావల్ కాలేజ్ తన నివేదికలో వెల్లడించింది.