నువ్వు ఎదగాలని కోరుకుంటున్నా: నెటిజన్ కు అనసూయ కౌంటర్
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

నువ్వు ఎదగాలని కోరుకుంటున్నా: నెటిజన్ కు అనసూయ కౌంటర్

Anasuya gives counter to a netizen
  • తన ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేసిన అనసూయ
  • నువ్వేమైనా సమంత అనుకుంటున్నావా అంటూ ఓ నెటిజన్ కామెంట్
  • నీవు మానసికంగా చిన్నపిల్లాడివి అన్న అనసూయ
సినీ నటి, బుల్లి తెర హాట్ యాంకర్ అనసూయ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. తనకు సంబంధించిన విషయాలు, తన అభిప్రాయాలు, తన సినిమాల వివరాలు తదితర అంశాలను సోషల్ మీడియా ద్వారా పంచుకుంటుంటుంది. అంతేకాదు అప్పుడప్పుడు తన గ్లామరస్ ఫొటోలను షేర్ చేస్తూ అభిమానులను ఎంటర్టైన్ చేస్తుంటుంది. తాజాగా ఒక ఫొటోను ఆమె షేర్ చేసింది. దీనిపై ఒక నెటిజన్ ఓ మీమ్ క్రియేట్ చేశాడు. నువ్వేమైనా సమంత అనుకుంటున్నావా? అని ప్రశ్నించాడు. దీనికి సమాధానంగా 'అయ్యో లేదమ్మా... నన్ను అనసూయ అంటారు' అని సమాధానం ఇచ్చింది.

అనసూయ రెస్పాన్స్ పై సదరు నెటిజన్ స్పందిస్తూ... క్షమించండి మేడమ్, ఆటపట్టించడం కోసమే సరదాగా అన్నానని చెప్పాడు. అయినా అనసూయ శాంతించలేదు. నువ్వు మానసికంగా ఇంకా చిన్నపిల్లాడివే అని తనకు అర్థమయిందని... నువ్వు త్వరగా ఎదగాలని కోరుకుంటున్నానని కౌంటర్ ఇచ్చింది. నెటిజన్లపై అనసూయ ఇలా ఫైర్ కావడం ఇదే తొలిసారి కాదు. గతంలో పలు సందర్భాలలో చాలా మందికి కౌంటర్ ఇచ్చింది.
Anasuaya
Netizen
Counter

More Telugu News